సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మన దగ్గర స్టార్‌డం సంపాదించుకున్నప్పటికి.. నార్త్ సైడ్ మాత్రం వెబ్ సీరీస్‌లతో అలరిస్తూ మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. అప్పటి వరకు సమంత హీరోయిన్‌గా మాత్రమే చేస్తుంది అనుకున్న వారందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సీరీస్‌తో సర్ ప్రైజ్ చేసింది. సమంత లోని మరో టాలెంట్ చూపించింది. దీంతో బీ టౌన్ ఆడియన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తోనే ‘సిటాడెల్’ సీరీస్‌ని కూడా చేసిన సమంత చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకుంది. అయితే సమంత నిర్మాణంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
Also Read : Priyadarshi : OTT లోకి వచ్చేసిన ‘సారంగపాణి జాతకం’
తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో, సమంత నిర్మాతగా చేసిన తాజా చిత్రం ‘శుభం’ . భారీ అంచనాల నడుమ ఇటివల విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఐతే సమంత తన బ్యానర్‌లో మొదట అనౌన్స్ చేసిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీలో సమంత లీడ్ రోల్‌గా నటిస్తుంది. చేతిలో తుపాకి పట్టుకుని సమంత పోస్టర్‌తో సహా ఈ సినిమా అనౌన్స్ చేసింది. కానీ ఏమైందో తెలిదు సడెన్‌గా ‘శుభం’ రిలీజ్ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ కూడా ఫినిషింగ్‌లో ఉందట. అంతే కాదు సమంత ఈ సినిమాను కూడా ఇదే ఇయర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుందట. అన్నీ కుదిరితే ఈ డిసెంబర్‌లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట. సమంత నిర్మాతగా ఒకే ఇయర్‌లో రెండు సినిమాలు రిలీజ్ చేయడం నిజంగానే గొప్ప విషయమని చెప్పవచ్చు. దీని గురించి అధికారికంగా ప్రకటన లేనప్పటికీ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.