Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతూనే ఉంది. సమంత, నాగచైతన్య గురించి అయితే క్షణాల్లోనే సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ నటించిన మొదటి మూవీ ఏమాయ చేశావే. అది మంచి హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత తన వీపు మీద వైఎమ్ సీ అనే టాటూ వేయించుకుంది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత దాన్ని చెరిపేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఓ వీడియోలో ఈ టాటూ కనిపించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ సమంత ఆ టాటూను చెరిపేసుకోలేదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో ఈ టాటూ కనిపిస్తోంది. అంటే విడాకులు తీసుకున్నా సరే.. తన సినిమాకు గుర్తుగా ఆమె అలాగే ఈ టాటూ ఉంచుకుంది.
Read Also : Vishwambhara : విశ్వంభర ఆ మూవీకి సీక్వెలా.. వశిష్ట ఏమన్నాడంటే..?
ఇది చూసిన సమంత ఫ్యాన్స్.. ఆమెకు సినిమాల పట్ల ఉన్న మమకారం అలాంటిది అంటూ చెబుతున్నారు. సమంత రీసెంట్ శుభం అనే సినిమాను నిర్మించింది. దాని తర్వాత వేరే సినిమా అప్డేట్ ఇవ్వలేదు. కానీ నందినిరెడ్డి డైరెక్షన్ లో హీరోయిన్ గా ఓ మూవీ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇంకో వైపు డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి బయట తిరుగుతుండటంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. మొత్తానికి సమంత చేస్తున్న పనులు నిత్యం మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పుడు టాటూ కనిపించేలా స్పెషల్ ఫొటో షూట్ చేయడం వెనక కారణం ఏంటని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Vishwambhara : రామ్ చరణ్ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..