స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ తన అభిమానులతో పలు విశేషాలను పంచుకుంటుంది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొంది. ఈ సెషన్ లో చాలా మంది అభిమానులు ఆమెను చాలా ప్రశ్నలు అడిగారు. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం సామ్ ఇచ్చిన ఎపిక్ రిప్లై ఆమె అభిమానులను ఆకట్టుకుంది.
Read Also : RJ Rachana : పాపులర్ రేడియో జాకీ హఠాన్మరణం
సమంత సెషన్‌ను ప్రారంభించి “నన్ను ఏదైనా అడగాలా ? ఏదో ఒకటి కాదు… నేను సమాధానం చెప్పాలనుకునే ప్రశ్నలు అడగండి” అంటూ చెప్పుకొచ్చింది. ఒక ప్రత్యేక అభిమాని ఆమెను అసాధారణమైన ప్రశ్న అడిగాడు. “Have you reproduced cuz I wanna reproduce u” అని అడిగాడు. దానికి సామ్ “ఒక వాక్యంలో ‘reproduce’ని ఎలా ఉపయోగించాలి? ముందుగా గూగుల్ చేసి తెలుసుకోవాలి” అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. తర్వాత మరో అభిమాని ఆమెను పనులు చేయడానికి ‘ఇంత ధైర్యం’ ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు. సామ్ బదులిస్తూ “పెద్ద కష్టాలను ఎదుర్కొంటే గొప్ప ధైర్యం వస్తుంది” అని చెప్పింది. ఒక వ్యక్తి ‘యంగ్ జనరేషన్’ కోసం సలహా అడగగా, “విరామం తీసుకోండి!!” అని చెప్పింది. భవిష్యత్తులో సినిమాకి దర్శకత్వం వహిస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు “ఎప్పుడూ చెప్పకూడదని నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను” అని సమాధానమిచ్చింది.

నంబర్ గేమ్ #1 స్టార్’ని నమ్ముతున్నారా ? అని ఒక అభిమాని అడిగినప్పుడు “లేదు. నేను ‘సంఖ్య 1 కంటే స్థిరమైన స్థానాన్ని నమ్ముతాను” అని అన్నారు. చివరగా “మీరు బాగున్నారా?” అని ఓ అభిమాని ప్రశ్నించారు. ఆమె బదులిస్తూ “అడిగినందుకు ధన్యవాదాలు” అని చెప్పింది.