Samantha: సాధారణంగానే సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ షో ‘కాఫీ విత్ కరణ్’ లో పాల్గొంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్ లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ సీజన్ లో మూడో ఎపిసోడ్ లో సమంత, అక్షయ్ కుమార్ సందడి చేశారు. ఎపిసోడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా నడిచింది. ముఖ్యంగా సామ్ అభిమానులు, చై అభిమానులు ఏదైతే కావాలని కోరుకున్నారో అది సామ్ నోటి నుంచి వినేశారు. నాగ చైతన్యతో విడాకులు, తదుపరి జరిగిన పరిస్థితులను సామ్ వివరించింది. ఇక దీంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కూడా సామ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
రామ్ చరణ్, సమంత జంటగా రంగస్థలం చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. ముఖ్యంగా చరణ్ భార్య ఉపాసన, సమంత మంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ షో లో రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అని కరణ్ ప్రశ్నించగా.. సామ్ టక్కున రామ్ చరణ్ ఒక ‘జి’ అని చెప్పింది. ఇక జి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని, అతడితో వర్క్ చేయడం అద్భుతమంటూ చెప్పుకొచ్చింది. అయితే ట్యాగ్ అయితే బాగానే ఉంది కానీ సామ్ కు చరణ్ గ్యాంగ్ స్టర్ లా ఎందుకు అనిపించాడు అనేది మాత్రం చెప్పకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా చరణ్ ను సామ్ ప్రశంసించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.