Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు ఏ స్థాయి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కోసమే థియేటర్లకు వెళ్లి అభిమానులు కూడా ఉన్నారు. హీరోయిన్లలో ఆమెను ఇప్పటివరకు కొట్టే వారే లేకుండా పోయారు. అలాంటి సమంత ఈ మధ్య సినిమాల్లో నటించి చాలా కాలం అవుతుంది. ఇక ఈరోజు నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది సమంత. నేడు పూజా కార్యక్రమాలు కూడా చేసింది. ఇందులో ఆమె రూమర్డు బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సమంత ఇకనుంచి హీరోల పక్కన నటించే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు.
Read Also : Mass Jathara : రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ రిలీజ్
ఆమెకు హీరోల పక్కన ఛాన్స్ వచ్చే పరిస్థితులు కూడా ఇప్పుడు పెద్దగా లేవు. సమంత క్రేజ్ ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదు. పైగా ఆమె గ్లామర్ హీరోయిన్ గా ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ కొత్త హీరోయిన్లు.. ప్యాన్ ఇండియా హీరోయిన్లు వచ్చేశారు. స్టార్ హీరోలు అందరూ ఫ్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఆ సినిమాల్లో బాలీవుడ్ బ్యూటీలు లేదంటే ఆల్రెడీ ప్యాన్ ఇండియా మార్కెట్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకుంటున్నారు. కాబట్టి స్టార్ హీరోల పక్కన సమంతకు ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. సమంత కూడా ఆ విధంగా దృష్టి పెట్టట్లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే గడిపేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నందిని రెడ్డితో కొత్త సినిమా ప్రకటించింది. ఈ లెక్కన సమంత రాబోయే రోజుల్లో హీరోల పక్కన కనిపించే ఛాన్స్ లేనట్టే.
Read Also : Sree Leela : పవన్ సినిమా నెక్ట్స్ లెవల్ అంతే.. శ్రీలీల హింట్