సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రపంచంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అభిమానులకు పండగే. ఇక ఇటీవల ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘యాంటీమ్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. నవంబర్ 26 న విడుదలైన చిత్రంలో ఆయుష్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. అల్టిమేట్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. సినిమాకు మొదటి రోజు నుంచే మంచి స్పందన వస్తోంది. అయితే థియేటర్లో సల్మాన్ అభిమానులు చేసిన పిచ్చి పని ఒకటి చర్చనీయంశంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సల్మాన్ అభిమానులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Read also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !
Also Read
సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ‘యాంటీమ్’ ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్లో అభిమానులు టపాసులు పేలుస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాని వల్ల మిగతా ప్రేక్షకులు సైతం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ థియేటర్లో ఇలా టపాసులు పేల్చడం మీకు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రమాదకరం. థియేటర్ల యజమానులు ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదు. ఎంట్రీలోనే ఇలాంటి పనులు చేయకుండా అడ్డుకోవాలి. సినిమాను ఎంజాయ్ చేయండి కానీ ఇలా కాదు. అభిమానులకు ఇదే నా రిక్వెస్ట్… దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ధన్యవాదాలు” అంటూ సల్మాన్ వీడియోలో చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!