బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ “టైగర్ 3” ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఒకటి. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో విడుదలైన కబీర్ ఖాన్ “ఏక్ థా టైగర్”, అలీ అబ్బాస్ జాఫర్ 2017 “టైగర్ జిందా హై” తర్వాత టైగర్ ఫ్రాంచైజీలో మూడవ భాగాన్ని సూచిస్తుంది. కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన “టైగర్ 3” హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాను ఇండియాతో పాటు విదేశాల్లోని పలు అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు.
Read Also : Pawan Kalyan : ఖరీదైన ప్లాట్ కొన్న పవర్ స్టార్ ?
తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ 1 నిమిషం 8 సెకన్ల నిడివితో ఉన్న టీజర్‌ను ఆవిష్కరించారు, ఇందులో కత్రినా కొన్ని యాక్షన్ సన్నివేశాలను చేస్తోంది. తన పనిని పూర్తి చేసిన తర్వాత ఈ బ్యూటీ సల్మాన్ ను ‘ఇట్స్ యువర్ టర్న్’ అంటూ నిద్రలేపడం కన్పిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ “టైగర్. సిద్ధంగా ఉంది. 2023 ఈద్ రోజున థియేటర్లలోకి హిందీ, తమిళం, తెలుగులో రానుంది. 21 ఏప్రిల్ 2023న మీకు సమీపంలో ఉన్న పెద్ద స్క్రీన్‌లో మాత్రమే #YRF50తో #Tiger3ని సెలెబ్రేట్ చేసుకోండి” అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. లీడ్ పెయిర్ కాకుండా ‘టైగర్3’లో ఇమ్రాన్ హష్మీ కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.