బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్ గా పేరు తెచ్చుకున్న టైగర్ సీరీస్ నుంచి వస్తున్న థర్డ్ సినిమా ‘టైగర్ 3’. ఈ మూవీ షూర్ షాట్ ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. నవంబర్ 10న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి టైగర్ 3 ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో టైగర్ 2 ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ప్రమోషన్స్ కి సూపర్ స్టార్ ఇవ్వాలి అంటే టైగర్ 3 టీజర్ బయటకి రావాలి. సల్మాన్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
సల్మాన్ ఫాన్స్ లో ఇంకాస్త జోష్ నింపడానికి టైగర్ ని జవాన్ తో కలిసి బయటకి వదులుతున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాపై సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా జవాన్ నిలుస్తుందని ప్రిడిక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సెప్టెంబర్ 7న రిలీజ్ అవనున్న జవాన్ సినిమాతో టైగర్ 3 టీజర్ ని రిలీజ్ చేస్తే హైప్ ఆకాశాన్ని తాకుతుందని యష్ రాజ్ ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్ వేశారు. నెక్స్ట్ లైనప్ లో టైగర్ vs పఠాన్ సినిమా ఉండడం… టైగర్ 3లో షారుఖ్ కూడా ఉండడంతో టైగర్ 3 కోసం షారుఖ్ ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో సల్మాన్ అండ్ షారుఖ్ ఫాన్స్ కలిసి జవాన్ రిలీజ్ రోజున థియేటర్స్ లో టైగర్ 3 టీజర్ ని చూస్తే… వాళ్లు చేయబోయే హంగామా ఏ రేంజులో ఉంటుందో చెప్పడానికి మాటలు చాలవు. పక్కా టైగర్ 3 టీజర్ వ్యూస్ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం గ్యారెంటీ.