బాలీవుడ్ బాక్సాఫీస్ ని అందరూ కోరుకున్నట్లుగానే రివైవ్ చేశాడు బాద్షా షారుఖ్ ఖాన్. దాదాపు దశాబ్దం తర్వాత పఠాన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్, కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ని ఒడ్డున పడేసాడు. హిందీ మార్కెట్ ని పూర్తిగా రివైవ్ చేసిన షారుఖ్ ఖాన్, కేవలం అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టాడు. షారుఖ్ పని అయిపొయింది అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చే రేంజులో హిట్ కొట్టాడు షారుఖ్. మొదటివారం ముగిసే సమయానికి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ‘బాహుబలి 2’, ‘KGF 2’ సినిమాల రికార్డులని కూడా చెల్లా చెదురు చేస్తున్నాడు. పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కనిపించడంతో సల్మాన్ ఖాన్ ఫాన్స్ కూడా పఠాన్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.
టైగర్, పఠాన్ లు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ కనిపిస్తుంది అని నిరూపించారు షారుఖ్-సల్మాన్ ఖాన్ లు. బాలీవుడ్ ని మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చెయ్యడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరిగితే చూడాలి అని సినీ అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ షారుఖ్, సల్మాన్ ఖాన్ లు మాత్రం బాక్సాఫీస్ క్లాష్ కి కాస్త దూరంగానే ఉంటారు. ఈ విషయంపై షారుఖ్ క్లారిటీ ఇచ్చేశాడు. “పఠాన్ సినిమాతో హిట్ కొట్టేసావ్ కానీ బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ తో పోటీకి ఎందుకు దిగవు” అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ “సల్మాన్ ఖాన్ ఆల్ టైం గ్రేటెస్ట్ హీరో #GOAT ” అంటూ రిప్లై ఇచ్చాడు. షారుక్ చెప్పినట్లు సల్మాన్ ఖాన్ నిజంగానే గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం. ఎందుకంటే ఒక ఫ్లాప్ సినిమాతో కూడా వందల కోట్లు రాబట్టగల సత్తా సల్మాన్ ఖాన్ సొంతం.
సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ కూడా GOAT లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య పఠాన్ సినిమాలో ఒక సీన్ ఉంది. “ముప్పై ఏళ్లు గడిచాయి, మనం రిటైర్ అయిపోదాం” అని సల్మాన్ ఖాన్ అనగానే, షారుఖ్ ఖాన్ “నిజమే కానీ మన స్థానంలో నిలిచే వాళ్లు ఎవరు? అయినా దేశ రక్షణకి సంబంధించిన విషయం కదా చిన్నపిల్లలపైన వదిలేయలేము” అంటాడు. ఇది బాలీవుడ్ కి కూడా వర్తిస్తుంది, హిందీ సినిమా బాగుండాలి అంటే సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ లు హిట్స్ కొట్టాల్సిందే.
Salman bhai is…woh kya kehte hain aaj kal…young log…haan….GOAT. ( greatest of all time ) #Pathaan https://t.co/91HJy8UZxU
— Shah Rukh Khan (@iamsrk) January 28, 2023