Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన క్లీన్ షేవ్ లుక్‌లో, కొంత అలసటగా కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట కనిపించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మౌనం పాటించిన సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసిన సల్మాన్, పూర్తిగా స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. ఒక ఫొటోలో కౌబాయ్ లుక్‌లో కనిపించిన ఆయన, 60 ఏళ్ల వయసులోనూ అదే స్వాగ్, అదే కాన్ఫిడెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలతో పాటు “మీరందరూ ఎలా ఉన్నారు?” అనే చిన్న క్యాప్షన్‌ను కూడా జత చేశారు.
ఈ ఒక్క పోస్టునే అభిమానులు ఆయన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలకు సమాధానంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనారోగ్య వార్తలను ఎక్కడా నేరుగా ప్రస్తావించకపోయినా, తన తాజా లుక్స్‌తో తాను బాగానే ఉన్నాననే సంకేతాన్ని సల్మాన్ ఇచ్చినట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతూ లక్షలాది లైక్‌లు, కామెంట్లను సొంతం చేసుకున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ ఆసుపత్రి బయట కనిపించిన సందర్భంలో ఆయన ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన పాపరాజీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజా ఇన్స్టాగ్రామ్ పోస్టుతో ఆ ప్రచారాలకు పరోక్షంగా తెరదించినట్లైంది.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘మాతృభూమి’ చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌లో కూడా సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నయనతార నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ఈ పోస్టుతో అభిమానులు ఊపిరి పీల్చుకోవడంతో పాటు, సల్మాన్ నుంచి త్వరలోనే మరిన్ని సినిమా అప్డేట్లు వస్తాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Aap logon ki tabiyat kaisi hai ? pic.twitter.com/sFWklGKo8K
— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2026
- Tags
- cinema
- Salman Khan
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!