ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తిగా గమనిస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. “రాధేశ్యామ్”తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ “సలార్”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక “సలార్” షూటింగ్ సగం పూర్తి కాగా, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు అంతా. తాజాగా ఎన్టీవీతో ఇంటర్వ్యూలో పాల్గొన్న “కేజీఎఫ్-2” డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి సినిమా గురించి కీలకమైన అప్డేట్ ను రివీల్ చేశారు.
Read Also : Acharya : మెగాస్టార్ కోసం రంగంలోకి సీఎం ?
“సలార్” మూవీ కొత్త షెడ్యూల్ మే 1 నుంచి స్టార్ట్ అవుతుందని అన్నారు. ఇక ఇది పక్కా తెలుగు పాన్ ఇండియా సినిమా అని, ‘కేజీఎఫ్-2’లో ఉన్నటువంటి అద్భుతమైన ఎమోషన్స్, ఎలివేషన్స్ “సలార్”లో కూడా ఉంటాయని, కాకపోతే అక్కడ యష్, ఇక్కడ ప్రభాస్ అంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక “కేజీఎఫ్-2” అంచనాలను మించి ఉండడంతో “సలార్”పై హైప్ ఆకాశాన్ని తాకిందని చెప్పాలి. దీంతో “సలార్” గురించి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్స్ ఫ్యాన్స్.