రిలీజ్ అయిన తర్వాత సలార్ రికార్డ్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయడానికి రెడీ అవుతున్నాయి కానీ రిలీజ్‌కు ముందే వాళ్లకు పని చెబుతోంది సలార్. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది డైనోసర్. రెండు భాగాలుగా రానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అర్థరాత్రి నుంచే మాస్ జాతర మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో సలార్ ట్యాగ్స్ టాప్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే… ఓవర్సీస్‌లో మాత్రం చాలా రోజుల క్రితమే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ సలార్ బుకింగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. సలార్ మేనియాలో డంకీ కలెక్షన్స్ ఎంత అనేది కూడా తెలియడం లేదు.
ప్రీ సేల్స్‌తోనే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది సలార్. రిలీజ్‌కు మరో మూడు రోజులు ఉండగానే… 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి 1.5 మిలియన్ డాలర్స్ టార్గెట్ గా ఉన్నాయి ఈరోజు సలార్ బుకింగ్స్. దీంతో ఓవర్సీస్‌లో సలార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయిన ప్రాంతాల్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా బెంగుళూరు లాంటి సిటీలో సలార్ బుకింగ్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సలార్ సంచలన వసూళ్లను నమోదు చేసేలా ఉంది. షారుఖ్ ఖాన్ డంకీ థియేటర్లో ఉన్నా కూడా డే వన్ ఓపెనింగ్స్ వంద కోట్లకు పైగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తునున్నాయి. మరి రిలీజ్ అయ్యాక… సలార్ సెన్సేషన్ ఇంకెలా ఉంటుందో చూడాలి.