రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మరి కొన్ని గంటల్లో సలార్ సినిమాని చూడడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ బాక్సాఫీస్ ని ఫైర్ సెట్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 99% బుకింగ్స్ ఫుల్ అయ్యాయి, ఈ రేర్ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా సలార్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా సలార్ హవా ఫుల్ రైజ్ లో ఉంది. సలార్ రిలీజైయ్యే రోజునే ఆక్వామన్ 2 రిలీజ్ అవనుంది. ఆక్వామన పార్ట్ 1 వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయ్యింది, పార్ట్ 2పై అనౌన్స్మెంట్ నుంచే బజ్ ఉంది. ఈ బజ్ ఇప్పుడు అసలు ఏ మాత్రం వినిపించట్లేదు, గ్రౌండ్ లెవల్ లో కూడా కనిపించట్లేదు. ఆక్వామన్ సినిమాని ప్రభాస్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా సైలెంట్ చేస్తోంది.
Nenu English lo clear ga cheppaaanu…
If we can’t, no one can… ani.Telugu lo chepthunnaa… Evvaduu Touch Cheyyaleduu… #SALAAR 🤘🏻🤘🏻 https://t.co/nukvy8q6TE pic.twitter.com/VN5qauxtq3
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 20, 2023
రీజనల్ మార్కెట్ లోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఆక్వామన్ 2 కి థియేటర్స్ లేవు. ఓవర్సీస్ లో ముఖ్యంగా డల్లాస్ ప్రాంతంలో ఆక్వామన్ 2 సినిమాకి 4 థియేటర్స్ మాత్రమే దక్కాయి. ఇదే సెంటర్ లో సలార్ సినిమా 23 థియేటర్స్ ని సొంతం చేసుకుంది. ఇలా ఒక సెంటర్ అనే కాదు ఆల్మోస్ట్ అన్ని ఓవర్సీస్ రీజన్ లో సలార్ సినిమా రాక్ సాలిడ్ గా కనిపిస్తోంది. ప్రత్యంగిరా సినిమాస్ సలార్ రైట్స్ ని సొంతం చేసుకోని హ్యూజ్ థియేటర్స్ ని ఇచ్చింది. దీని కారణంగా సలార్ సినిమాకి కేవలం అమెరికాలోనే 2500 పైగా షోల్లో ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ షోస్ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది, ప్రభాస్ ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపి ఎన్ని మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేస్తాడో చూడాలి. ఇప్పటికైతే 2 మిలియన్ డాలర్స్ ప్రీమియర్ కేక్ వాక్ లానే కనిపిస్తోంది.