Saif Ali Khan : సినీ ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పక్కర్లేదు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలతో అదరగొడుతున్నారు. హీరోగా కంటే ఇప్పుడే చాలా బిజీ అయిపోయారు. ఇక ఆస్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయన సొంతం. అలాంటి సైఫ్ అలీఖాన్ ఖర్చుల కోసం ఓ లేడీ ప్రొడ్యూసర్ కు ముద్దులు ఇచ్చేవాడంట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కావు.
Read Also : Stampedes : తొక్కిసలాటలు.. అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా..?
ఆ టైమ్ లో చాలా ఇబ్బందులు పడేవాడిని. ఖర్చులకు డబ్బుల కోసం ఓ లేడీ ప్రొడ్యూసర్ ను అడిగితే ఆమె కొన్ని కండీషన్ల పెట్టింది. పది ముద్దులు ఇస్తే రూ.వెయ్యి ఇచ్చేది. అలా ఆమెకు ముద్దులు పెట్టి వారానికి వెయ్యి తీసుకునేవాడిని. నాకు సినిమా బ్యాగ్రౌండ్ ఉందనే నాకు ఛాన్సులు వచ్చేవని అంతా అనుకునేవారు. కానీ అందులో నిజం లేదు. నేను కూడా అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాను. మొదట్లో సడెన్ గా సినిమాల్లో నుంచి తీసేసేవారు. ఎన్నో అవమానాలు భరించాను అంటూ తెలిపాడు సైఫ్ అలీఖాన్.
Read Also : Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..