యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపధ్యలోనే హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తి సురేష్, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ ” ఈరోజు నేను ఏడిస్తే బావుండదు.. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడికి ఒక గెస్ట్ లా రాలేదు.. నా ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చాను. సినిమా ట్రైలర్ చూశాక నా పెదవులపై చిరునవ్వు ఉంది. అలాగే ప్రేక్షకులు బయటికి వచ్చేటప్పుడు కూడా అదే నవ్వు ఉంటుంది.
ఇక శర్వా గారి గురించి చెప్పాలి. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. చాలా స్వీట్ పర్సన్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం శర్వా గారిది. ఒక పెద్ద స్టార్ అయిపోయాను. అలాగే ఉండాలి అని అనుకోరు. అదే తనను అందరికి దగ్గర చేస్తుంది. ఇక రష్మిక నవ్వు చాలా ప్రత్యేకం.. పొద్దున్న నుంచి ఎంత పని చేసి అలసిపోయినా ఆమె నవ్వు మాత్రం చెరగదు. ఆ నవ్వు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ నవ్వుతో అందరికి పాజిటివిటీని పంచాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.