కొంతమంది నటీమణులు తమ గ్లామర్ ద్వారా అభిమానులను ఆకర్షిస్తే, మరికొందరు తమ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఆమె “ప్రేమమ్” నుండి మొదలుకుని ఎల్లప్పుడూ సహజ నటనతో హృదయాలను గెలుచుకున్నారు, గ్లామర్‌పై ఆధారపడకుండా. చిత్ర నిర్మాతలు కూడా ఆమెను గ్లామర్ షో కోసం ప్రత్యేకంగా చిత్రీకరించలేదు. కానీ, ఇటీవల ఆన్‌లైన్‌లో సాయి పల్లవి స్విమ్‌సూట్, బికినీ ఫోటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read : Ameesha Patel : పెళ్లయ్యాక అలా చేయమంటున్నారు.. షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన పవన్ బ్యూటీ
కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యపోయి, మరి కొందరు తీవ్రంగా విమర్శలు చేశారు. “రామాయణం” వంటి భక్తి ప్రాజెక్టులలో నటిస్తున్న నటీనటిని ఇలా చూపడం ఎందుకు?” అనే చర్చ సోషల్ మీడియాలో వేగంగా ప్రారంభమైంది. అయితే, నిజం వేరే. ఈ వైరల్ ఫోటోలు అసలు నిజమైనవి కాదని. కొంతమంది సాయి పల్లవి సోదరి షేర్ చేసిన ఒరిజినల్ చిత్రాలను మార్ఫ్ చేసి, స్విమ్‌సూట్ మరియు బికినీ ధరించినట్లు కనిపించేలా తయారుచేశారట. సాయి పల్లవి సోదరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే, వైరల్ ఫోటోలు నకిలీ గా ఉన్నాయని స్పష్టమవుతుంది. దురదృష్టవశాత్తూ, వాస్తవాలు తెలియకుండానే చాలా మంది ఈ చిత్రాలను నిజమైనవిగా నమ్మి, నటిని ట్రోల్ చేయడం ప్రారంభించారు.