Sai Dharam Tej: ‘బ్రో’ చేయనన్నాను.. కళ్యాణ్ మామ ఏడిపించాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej Speech At BRO Pre Release Event : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా చేయాలని కళ్యాణ్ బాబాయ్ చెప్పినప్పుడు సరి చేసేస్తాను అన్నాను కానీ ఇది ఒక మల్టీ స్టారర్ అని నువ్వు మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నావు, నేను మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అని చెప్పగానే షాక్ అయ్యానని అన్నారు. సినిమాలో నేను మెయిన్ లీడ్ ఏంటి? మీరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా? ఊరుకోండి మావయ్య అంటే లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నారు. నేను బయలుదేరి వెళ్లాను. అక్కడికి వెళ్ళాక కూడా ఆయన నాకు ఫోన్లో చెప్పింది మళ్ళీ రిపీట్ చేశారు. అయితే ముందు సినిమా చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టి నాకు మనసు ఒప్పలేదు. కానీ నాకు ఆ విషయం తర్వాత అర్థమైంది. నన్ను ఏడిపించడానికి అలా చెప్పారు. కానీ ఆ ఏడిపించడాన్ని క్యాప్చర్ చేయడానికి సముద్రఖని చాలా కష్టపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా మొన్న జరిగింది. కానీ సినిమా ఎప్పుడో ఓకే అయింది. అయితే అప్పటికి నేను ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను.
Varun Tej: బాబాయ్ ఎక్కడున్నా మెగా హీరోలంతా ఆయన వెంటే.. ఇది పక్కా!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
నేను దాదాపు 12 రోజుల్లో కోమాలో ఉంటే మా కళ్యాణ్ మామయ్య ప్రతిరోజు సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి కూర్చునే వాడు. నా చేయి పట్టుకొని నీకేమీ కాదురా అని చెప్పేవాడు. నాకు ప్రతి సారి అది వినపడుతూనే ఉండేది. థాంక్యూ మామయ్య థాంక్యూ సో మచ్ లవ్ యు. అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది, అభిమానులందరూ చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని తొడగొట్టి ముందుకు వెళుతూ ఉంటారు. అదైతే ప్రామిస్ చేసి చెప్పగలను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చిన్న స్పెషాలిటీ ఉంది. వాళ్ళు మొదట్లో చేసిన సినిమా వెంకీ మామ అని చెప్పారు, అందులో ఒక మేనమామను మేనల్లుడిని కలుపుతారు. ఈ సినిమాతో కూడా ఒక మేనమామని, మేనల్లుడిని కలిపారు. సార్ ఇది చాలా స్పెషల్, నాకు ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. జీవితంలో చివరి క్షణం వరకు గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మెమరీ ఇది. సముద్రఖని గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్, నేను కథ విన్నప్పుడు ఎలా ఎక్సయిట్ అయ్యానో అదే విధంగా సినిమా తీశారు. హ్యాట్సాఫ్ టు యు. మీరు ఏమైతే ఒక విజన్ తో సినిమాని ఊహించుకున్నారో దాన్ని తెరమీద చూపించారు. త్రివిక్రమ్ గారికి నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకోవాలి.
నాకు మా మామయ్యతో మా గురువుగారితో నటించే అవకాశం ఇప్పించారు. నాతో ఈ పాత్ర చేయించాలనే ఆలోచన ఆయనకే వచ్చింది, అందుకే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. మా కెమెరా మన సుజిత్ గారు చాలా బాగా క్యాప్చర్ చేశారు, మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా అయితే మేము అనుకున్నామో ఎలా అయితే మేము ఉన్నామో దాన్ని అలాగే క్యాప్చర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మా టైం డిజైన్ చేసి నన్ను డిజైన్ చేసిన నీతా మేడంకి థాంక్స్ అని చెప్పుకొచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి గారికి థాంక్స్. నాతో కలిసి నటించిన నటీనటుల పేర్లు సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను కానీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈవెంట్ కి వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈవెంట్ కి విచ్చేసిన అభిమానులను ఉద్దేశించి మై బ్రోస్ మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్, మీ ప్రేమ పొందడం కోసమే మళ్లీ నేను ఈ స్టేజ్ మీదకు వచ్చానేమో అనిపిస్తుంది. ఈ స్టేజ్ మీదకు నేను రావడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలకి నేను ఎల్లకాలం తలవంచే ఉంటాను. థాంక్యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ జైహింద్.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?