Sai Dharam Tej: వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ‘బ్రో’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా ఈ పవర్ పండగ కోసం ఇన్ని రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వర్షాల కారణంగా భారీ సంబరాలు చేసే అవకాశం లేదు కానీ లేదంటే ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్, సింగల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అన్ని సెంటర్స్ ని మెగా ఫాన్స్ కబ్జా చేసే వాళ్లు. ట్రైలర్ తో హైప్ పెంచిన మేకర్స్, గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ తో మరింత సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఆ హైప్ తెచ్చే ఓపెనింగ్స్ ఏ రేంజులో ఉంటాయో రేపు థియేటర్స్ లో చూడాలి. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ వరకూ అయితే కొన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ కనిపించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వర్షాల కారణంగా బ్రో సినిమాకి నైజాంలో కాస్త కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఫాన్స్, వానొచ్చినా వరదొచ్చినా థియేటర్స్ కి వెళ్లిపోయి ‘జై పవర్ స్టార్’ అనేస్తారు బ్రో. అందులో డౌటే లేదు అయితే వారసత్వంలో మామకి తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఒక లెటర్ ని రిలీజ్ చేసాడు. వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటూ ఎంతో బాధ్యాతాయుతంగా అభిమానులని కోరాడు. మా సినిమాకి మీ సపోర్ట్ కావాలి కానీ అంతకన్నా ముందు మీ సేఫ్టీ కూడా నాకు ముఖ్యమే అంటూ సాయి ధరమ్ తేజ్ లెటర్ రిలీజ్ చేయడంతో ఫాన్స్ అంతా చాలా వార్మ్ గా ఫీల్ అవుతున్నారు. తేజ్ రిలీజ్ చేసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వానని కూడా లెక్క చేయకుండా మెగా ఫాన్స్ ‘బ్రో’ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ ని ఇస్తారో చూడాలి.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
Your safety is above any celebration.
Please consider my humble request above your excitement and love.Forever Grateful 🙏#BroTheAvatar pic.twitter.com/Mx3BdKGCGX
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?