మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ గతేడాది టెర్రిబుల్ బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తేజు బయట కనిపించింది తక్కువే.. ఇటీవల వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నా ఇంకా తేజ్ ఏదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది అని అభిమానులు అంటున్నారు. అయితే వారు అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ ముఖం మొత్తం పాడైపోయిందని, తేజ్ పూర్తిగా తగ్గిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరవాత మెగా ఫ్యామిలీ పండగ వేళ సాయి ధరమ్ తేజ్ ఫోటో చూసి అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి వరకు ఓకే అంటే తాజగా దుర్గమ్మ సన్నిధికి వెళ్లిన మెగా మేనల్లుడు పూర్తిగా ముఖాన్ని దాచుకొని కనిపించాడు.
మాస్క్, తలపాగా ..పూర్తిగా గెటప్ ఛేంజ్ చేసి పబ్లిక్ లో కనిపించాడు. పర్టిక్యులర్ గా చూస్తే కానీ తేజ్ అని గుర్తు పట్టలేరు. అయితే ఇంతగా ముఖం దాచుకోవాల్సిన అవసరం ఏముంది తేజ్.. అంతా బాగానే ఉందిగా.. మరి ఇదంతా ఎందుకు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే అలా కవర్ చేయడానికి కూడా ఒక కారణం ఉందని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం తేజ్ కొత్త సినిమా పనుల్లో నిమగ్నమయ్యి ఉన్నాడు.. ఆ లుక్ కోసం చాలా రోజుల నుంచి శ్రమిస్తున్నాడని.. ఇప్పుడప్పుడే ఆ లుక్ ని రివీల్ చేయాలనుకోవడంలేదని, అందుకే ముందు జాగ్రత్తగా ముఖాన్ని కవర్ చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి..