Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Abhyankkar: యంగ్ మ్యూజిక్ సెన్సెషన్, సింగర్ సాయి అభ్యంకర్ తన 6 th ఇండిపెండెంట్ సాంగ్ ‘రాధిమా’ గురించి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా తన పాటలతో యూత్‌ను ఆకట్టుకునే సాయి అభ్యంకర్.. ఈసారి తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే పాటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాట టైటిల్ వెనుక ఉన్న కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. ‘రాధిమా’ పూర్తిగా ఓ బ్రేకప్ సాంగ్ అని వెల్లడించారు. ప్రేమ, బ్రేకప్, ఆ తర్వాత మిగిలే భావోద్వేగాలను ఈ పాటలో ప్రతిబింబించేలా రూపొందించినట్లు చెప్పారు. అందుకే ఈ పాట తనకు మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. మ్యూజిక్ లవర్స్‌ను అలరించడంతో పాటు, లవ్ బ్రేకప్ అయిన వారికి కూడా ఈ పాట కనెక్ట్ అవుతుందని చెప్పారు.
అయితే ఈ పాటకు ‘రాధిమా’ అనే పేరు పెట్టడం వెనుక అసలు కారణమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాయి అభ్యాంకర్ తన మాజీ లవర్ పేరునే ఈ పాటకు టైటిల్‌గా పెట్టినట్లు వెల్లడించారు. దీంతో ‘రాధిమా’ పాట కేవలం ఓ కల్పిత ప్రేమకథ ఆధారంగా రూపొందింది కాదని, తన వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టిన పాటగా తెలుస్తోంది. తన పాస్ట్ లవ్‌ను మ్యూజిక్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా సాయి అభ్యాంకర్ ఈ పాటను మరింత వ్యక్తిగతంగా మార్చారు. ఒకవైపు బ్రేకప్ ఎమోషన్, మరోవైపు మాజీ లవర్ పేరును టైటిల్‌గా ఉపయోగించడం.. ‘రాధిమా’పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పటికే సాయి అభ్యంకర్ ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వరుస సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తూ కొత్త తరహా పాటలను అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్‌ను ఏర్పరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన లవ్ లైఫ్ నుంచి వచ్చిన ‘రాధిమా’ పాటకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?