Sadha: టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ లాంటి నటుడు మళ్లీ పుట్టడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చి ఒక స్టార్ హీరో స్టేటస్ ను అనుభవించి, ఒకానొక దశలో అవకాశాలు రాక వేరే ఉద్యోగలో స్థిరపడలేక డిప్రెషన్ కు గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ మృతి పెను సంచలనాన్నే రేపింది. అయితే ఇప్పటివరకు ఉదయ్ కిరణ్ మృతి పట్ల ఎంతోమంది ప్రముఖులు ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ, ఇప్పటివరకు ఉదయ్ కిరణ్ మృతి పట్ల.. అతనితో నటించిన హీరోయిన్స్ ఎవరు నోరు విప్పింది లేదు. అయితే తాజాగా హీరోయిన్ సదా, ఉదయ్ కిరణ్ మృతిపై మాట్లాడింది. ఇటీవలే హలో వరల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె మంచి విజయాన్ని అందుకోంది.
ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో సదా మాట్లాడుతూ ” ఉదయ్ కిరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు. ఒక మంచి నటుడిని కోల్పోవడం దురదృష్టం. ఆయనతో కలిసి నేను ‘ఓనన్నా కాదన్నా’ చేశాను. ఎంతో మంచి వ్యక్తి. అతని కెరీర్లో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. అయితే ఏది జరిగినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కొన్నిసార్లు రావు. కానీ వీటికంటే లైఫ్ చాలా ముఖ్యం. దానితో నిత్యం పోరాడుతూ ఉండాలి. ఒక యాక్టర్ గా మనం మంచి గా బెస్ట్ ఇవ్వాలంతే.. మిగతాది ప్రేక్షకులు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పరిస్థితులను బట్టి మారుతుంది. సమస్య వచ్చినప్పుడు చావే పరిష్కారం కాదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.