పుష్ప : “సామీ సామీ” మాస్ సాంగ్ ప్రోమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ చిత్రం నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. అయితే అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. తాజాగా “సామీ సామీ” అనే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశారనిపిస్తోంది సుకుమార్. ఈ మొత్తం సాంగ్ 28వ తారీకు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సాంగ్ ప్రోమో మాత్రం విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక”, రెండవ సాంగ్ “శ్రీవల్లి” మంచి ఆదరణను దక్కించుకుని, ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మూడవ సాంగ్ అంతకంటే ఎక్కువ ఆదరణను పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. “సామీ సామీ” సాంగ్ ను మౌనిక యాదవ్ పాడగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారన్న విషయం తెలిసిందే.
Read Also : జాతీయ పురస్కారాలు అందుకున్న మామఅల్లుడు!
Also Read
- Agadha:14 మిలియన్ వ్యూస్‌తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Trikala OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
- Huma Qureshi: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్‌పై హుమా ఫైర్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. ‘పుష్ప: ది రైజ్’ ఈ ఏడాది డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ విలన్ గా కన్పించబోతున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఈ షో హౌస్‌పుల్.. బ్లాక్‌బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
-
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్‌ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!