Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరు మార్మోగిపోతోంది. కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకుంది. మొన్నటి దాకా వరుస ప్లాపులు అందుకున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు మంచి బ్రేక్ దొరికింది. అయితే ఆమె పేరెంట్స్ ఎవరో తెలిస్తే మాత్రం సెల్యూట్ చేయకుండా ఉండలేరేమో. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన ఆర్మీ ఆఫీసర్. 2007 పాకిస్థాన్ తో జరిగిన యురి సరిహద్దు యుద్ధంలో భీకరంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయనకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన అశోక చక్ర అవార్డు దక్కింది.
Read Also : Rashmika : రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?
ఆయన చనిపోయే సమయానికి రుక్మిణీ వయసు కేవలం ఏడేళ్లు మాత్రమే. ఆమె తల్లి సుభాషిణి వసంత్. సుభాషిణి ఫేమస్ భరత నాట్యం డ్యాన్సర్. భర్త చనిపోయాక ఆమె తన స్వార్థం చూసుకోలేదు. తనలాగా సైన్యంలో భర్తలను కోల్పోతున్న మహిళల కోసం ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందరికీ సాయం చేస్తోంది. రుక్మిణీకి ఇంత మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆమె నటనవైపు అడుగులు వేసింది. కానీ ఎక్కడా వల్గర్ పాత్రలు చేయకుండా తన పేరెంట్స్ కు ఉన్న పేరును కాపాడుకుంటోంది. గ్లామర్ ఎక్స్ పోజ్ చేసే పాత్రలకు దూరంగా ఉంటూ సాయిపల్లవిలాగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. ఆ నిర్ణయమే ఆమెకు ఎన్టీఆర్ నీల్ సినిమాలో, టాక్సిక్ సినిమాలో అవకాశాలు తెచ్చి పెట్టింది.
Read Also : OG : ఓజీ-2లో అకీరా.. సుజీత్ సంచలన స్టేట్ మెంట్
