కన్నడ సొగసరి రుక్మిణి వసంత్‌కు కెరీర్‌లో పెద్ద బ్రేక్ రావడానికి కొంత సమయం పట్టింది. అయితే రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా ఆమె సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, ఆ తర్వాత వరుస అవకాశాలకు బాటలు వేసాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే.
Also Read : Kangana : రక్తంతో నిండిన బెడ్‌షీట్ చూసి భయపడ్డా..
ఇందులో ముఖ్యంగా ‘కాంతార చాప్టర్-1’ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాలో రుక్మిణి కనకావతి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ మంచి హంగామా సృష్టించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రుక్మిణి మాట్లాడుతూ.. “రిషబ్ శెట్టి సర్ నన్ను సినిమా కోసం సంప్రదించినప్పుడు, నిజంగా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా కల నిజమైనట్టే అనిపించింది. ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించబోతుంది. చిత్రబృందం కోరుకున్నందువల్ల ఇప్పటివరకు నా పాత్ర గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ రాగానే అందరికీ తెలిసిపోయింది” అని చెప్పుకొచ్చారు. ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లలో ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ ఒక్కటి, తమిళంలో ‘మదరాసి’, కన్నడంలో యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ ఈ వరుస ప్రాజెక్టులు చూస్తుంటే, రుక్మిణి వసంత్ కెరీర్ గ్రాఫ్ మరింత ఎత్తుకు చేరనుంది అనడం ఖాయం.