అగ్ర చిత్రనిర్మాత రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా ప్రమోషన్లను తాజాగా స్టార్ట్ చేశారు రాజమౌళి. చిత్ర బృందం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లలో భాగంగా ముంబై నుండి న్యూఢిల్లీ వరకు అనేక నగరాలను సందర్శించాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో స్పెషల్ ఈవెంట్ లు ప్లాన్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈరోజు ముంబైలో “ఆర్ఆర్ఆర్” మూవీ బిగ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు రాజమౌళి అండ్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హాజరుకానుంది. ముంబై అంధేరి వెస్ట్, పివిఆర్ సిటీ మాల్ లో జరుగుతున్న “ఆర్ఆర్ఆర్” ప్రత్యేక ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుండగా… అందులో భాగంగా “ఆర్ఆర్ఆర్” మూవీ గ్లింప్స్ ను కూడా ఆవిష్కరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also : “ఖిలాడీ” దీపావళి కానుక ఇదే
జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్ భీమ్, బీమ్ ఫర్ రామరాజు వీడియోలు, మొదటి సింగిల్ ‘దోస్తీ’ ప్రేక్షకులను అలరించాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా ఇద్దరు నిజమైన స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజుల మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ వంటి పలువురు ప్రముఖులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.
GET RRREADYYYY…. 😄🔥🌊 #RRRMovie pic.twitter.com/WVobPkss2j
— RRR Movie (@RRRMovie) October 29, 2021