ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించడం.. బాహుబలి
వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. నేడు శివరాత్రి పండగను పురస్కరించుకొని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఫ్యాన్స్ కి చిన్న సర్ ప్రైజ్ ని ఇచ్చారు. రామ్- భీమ్ లు ఇద్దరూ షూటింగ్ తరువాత ఎలా ఉంటారో తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేశారు.
“కెమెరా రోలింగ్ కానప్పుడు స్క్రోలింగ్” అని ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఫొటోలో రామ్- భీమ్ ఇద్దరు పచ్చటి గడ్డి మీద మ్యాట్స్ పై పడుకోని ఫోన్స్ చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. షూటింగ్ లో రణం, రౌద్రం చూపించిన ఈ యంగ్ హీరోలు.. షూటింగ్ లేనప్పుడు ప్రశాంతంగా ఇలా ఫోన్లలో మునిగిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక చాల రోజుల తరువాత తమ హీరోల ఫోటో చూసేసరికి అభిమానులు ఈ ఫోటోను ట్రెండ్ చేసేస్తున్నారు.
Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/yTHxZ7whvc
— DVV Entertainment (@DVVMovies) March 1, 2022