మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్‌గా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు, బీస్ట్.. సినిమాలు వరుసగా ఓటిటిలోకి సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఈ మూడు సినిమాల్లో ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.. కానీ ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్ మూవీ మాత్రం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కెజియఫ్ చాప్టర్ టుకి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియెన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. దాంతో థియేటర్లకు వెళ్దామనుకున్న ప్రేక్షకులు.. ఓటిటిలోకి వచ్చాక చూద్దాంలే.. అనే మూడ్‌లో ఉండిపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ థియేటర్స్ రన్ క్లోజ్ అయిన ఈ సినిమా.. నెల రోజులలోపే ఓటిటిలోకి వచ్చేస్తోంది. ఒకేసారి అన్ని భాషల్లో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో.. మే 11 నుంచి బీస్ట్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఇక బీస్ట్ ఓటిటి డేట్ లాక్ అయిపోయిన నేపథ్యంలో.. ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు ఓటిటి డేట్స్ గురించి చర్చ జరుగుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రిపీటేడ్ మోడ్ అన్నట్టు థియేటర్లో చూసి తెగ సందడి చేశారు మెగా, నందమూరి అభిమానులు. ఇక ఓటిటి అభిమానులైతే.. ట్రిపుల్ ఆర్ ఎప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందా.. అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ ఓటిటి హక్కులను సౌత్ భాషల్లో జీ5.. హిందీ వెర్షన్లో నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నాయి. దాంతో మే 20న.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, ట్రిపుల్ ఆర్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. లేదంటే జూన్ 3న ఓటిటిలోకి రావడం పక్కా అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఏప్రిల్ 14న విడుదలై.. వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన కెజియఫ్ టు.. ఓటీటీ రిలీజ్ డేట్ అప్టేట్ కూడా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27 నుంచి.. అన్ని భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుందని తెలుస్తోంది. దీనిపై కూడా అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఏదేమైనా థియేటర్లో బ్యాక్ టు బ్యాక్ అలరించిన ఈ సినిమాలు.. ఓటిటిలోను అలాగే రాబోతున్నాయని చెప్పొచ్చు.