ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన రియల్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల దాదాపు రెండు నెలలకు ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ మూవీ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘జీ 5’లో ప్రసారం అయ్యింది. సహజంగా ఇలాంటి భారీ చిత్రాలను వెండితెర మీద చూడటానికే జనం ఇష్టం పడతారు. అయితే చిత్రంగా బాక్సాఫీస్ దగ్గర చక్కని కలెక్షన్లను వసూలు చేసిన ‘ట్రిపుల్ ఆర్’ ఓటీటీ లోనూ బాగానే సందడి చేసింది. అయితే ఇప్పుడీ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నాయి. సో… ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ మెంబర్స్ ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ను చూసి ఎంజాయ్ చేయొచ్చు.