ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల పరంగా ఇప్పటిదాకా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ‘బాహుబలి-2’ను మించి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మొదటి రోజునే రూ.223 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఆల్ టైమ్ అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది. అయితే ‘బాహుబలి-2’ మొదటి రోజున రూ.121 కోట్లు రాబట్టింది. మొత్తానికి తన రికార్డులను తానే తొక్కుకుంటూ పోతున్నాడు జక్కన్న.
Read Also : Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్
ఇక సినిమా విషయానికొస్తే… ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇద్దరు స్టార్స్ కూడా సినిమాకు అన్ని భాషల్లో కలిపి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కు సంతోషంగా ఉన్నారు. రాజమౌళితో సహా టీం అంతా ‘ఆర్ఆర్ఆర్’ సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. మరి రానున్న రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల పరంగా ఎలాంటి హిస్టరీని క్రియేట్ చేస్తుందో చూడాలి.
