రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. ఈ మూవీతో రష్మిక కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది. విజయ్-రష్మికల కాంబినేషన్ కి క్రేజ్ మొదలయ్యింది గీత గోవిందం సినిమా నుంచే. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ టైర్ 2 హీరోలకి ఒక బెంచ్ మార్క్ అనే చెప్పాలి. ఒక ప్యూర్ లవ్ స్టొరీతో అంత పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ అయిదేళ్ల తర్వాత రిపీట్ అవనుంది. దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. విజయ్ దేవరకొండ బర్త్ డే రోజున ఫాన్స్ ని ఖుషి చేస్తూ ‘VD 13’ గురించి స్పెషల్ న్యూస్ బయటకి వచ్చింది. త్వరలో సెట్స్ పైకి వెళ్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, ఖుషి సినిమా చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ అయిపోగానే గౌతమ్ తిన్నునూరితో ‘VD 12’ చేస్తున్నాడు. ఈ స్పై సినిమాని వాయిదా వేసి విజయ్ ‘VD 13’ని స్టార్ట్ చేస్తాడా లేక రెండు సినిమాలు సైమల్టేనియస్ గా సెట్స్ పైకి వెళ్తాయా అనేది చూడాలి. ఇదిలా ఉంటే రౌడీ హీరో ఫాన్స్ మాత్రం “గీత గోవింద హీరో-డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారు కదా, హీరోయిన్ ని కూడా గీత గోవిందం నుంచే రిపీట్ చెయ్యండి. మాకు రష్మిక కావాల్సిందే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘VD 13’లో రష్మిక కూడా జాయిన్ అయితే ప్రాజెక్ట్ పై హైప్ తప్పకుండా పెరుగుతుంది. మరి ఈ విషయంలో ,మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రష్మిక హీరోయిన్ గా సెలక్ట్ అవుతుందా లేక వేరే స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతుందా అనేది చూడాలి.
Team #VD13 wishes the uber-stylish and powerhouse performer, THE #VijayDeverakonda a very happy birthday!💥@ParasuramPetla and team is gearing up to begin the shoot soon!! ❤️🔥@TheDeverakonda#HBDTHEVijayDeverakonda pic.twitter.com/9XRMwxxpZq
— Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2023