నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక చిత్రం చేయనున్నాడు.
మహానటి లాంటి ప్రతిష్ఠాత్మకమైన సినిమా నిర్మించిన ఈ బ్యానర్.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె ను నిర్మిస్తుంది. ఇలాంటి బ్యానర్ లో రోషన్ ఒక కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న దత్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేడు రోషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించి తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. మరి ఈ సినిమాతో రోషన్ కెరీర్ గాడిలో పడుతుందా.. యంగ్ హీరో హిట్ అందుకుంటాడా..? అనేది చూడాలి.
