Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఒక దర్శకుడు క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్లో హిట్లు కొడితే.. అదే సేఫ్ జోన్ అనుకుని వరుసగా అలాంటి సినిమాలే తీస్తుంటారు. కానీ, ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టి, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్స్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు అనూహ్యంగా రూటు మార్చాడు. రక్తం, మర్డర్ మిస్టరీలు, పోలీసు ఇన్వెస్టిగేషన్స్ పక్కనపెట్టి.. పూర్తిగా ఒక స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన ప్రేమకథతో రాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తెరకెక్కిస్తున్న ఆ క్యూట్ అండ్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పేరే ‘ఏమో ఏమో ఇది’.
యంగ్ అండ్ డైనమిక్ హీరో రోషన్ మేక, అందాల తార ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. ఈ శీతాకాలంలో యువతకు సరికొత్త ప్రేమానుభూతిని పంచేందుకు ఈ సినిమా అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్ గా రాబోతోంది. ఇప్పటికే మేకర్స్ వదిలిన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ఏమో ఏమో ఇది’ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక కరుడుగట్టిన క్రైమ్ థ్రిల్లర్స్ తీసే డైరెక్టర్ లో ఇంతటి సాఫ్ట్, రొమాంటిక్ యాంగిల్ ఉందా? అని ఆ గ్లింప్స్ చూసిన ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. రోషన్, ప్రీతిల ఫ్రెష్ పెయిర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రేమకథలకు సంగీతం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాకు యూత్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ను రంగంలోకి దింపారు. ఆయన సంగీతం, వంశీ పచ్చిపులుసు కెమెరా విజువల్స్ ఈ చిత్రానికి ప్రాణం పోయనున్నాయి. టాలీవుడ్ లో అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
Also Read
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!