Site icon NTV Telugu

Rohit Sharma: బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న రోహిత్ శర్మ.. ‘మెగా బ్లాక్‌బస్టర్’ అందుకునేనా?

Rohit Sharma Movie

Rohit Sharma Movie

Rohit Sharma: మైదానంలో సిక్సర్లతో హోరెత్తించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే మూవీలో రోహిత్ శర్మ లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్‌వేర్ గెటప్‌లో రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. ఈనెల 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో కార్తి, బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ గంగూలీ, ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న, త్రిష నటిస్తోన్నారు. ది కపిల్ శర్మ టాక్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కపిల్ శర్మ ఈ మూవీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు.

Read Also: HariHara Veeramallu: తొడకొట్టిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు గూస్‌బంప్స్ తెస్తోన్న ‘పవర్ గ్లాన్స్’

అయితే మెగా బ్లాక్ బస్టర్ పోస్టర్ చూసిన తర్వాత నెటిజన్‌లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది అసలు మూవీ కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. టెలివిజన్ షో అయ్యుండొచ్చని చెబుతున్నారు. లేదా ఏదైనా అడ్వర్టయిజ్‌మెంట్ కోసం స్టార్ క్యాస్ట్ మొత్తం ఇలా కనిపిస్తోందని చెబుతున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే.. ఎల్లుండి విడుదల కాబోతోన్న ట్రైలర్ కోసం ఎదురు చూడాల్సిందే. ఫస్ట్ లుక్ పోస్టర్లల్లో ట్రైలర్ రిలీజ్ డేట్ తప్ప మరే ఇతర వివరాలను వెల్లడించకపోవడం ఈ మెగా బ్లాక్‌బస్టర్‌పై హైప్ క్రియేట్ చేసింది. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం ఆసియా కప్ 2022 టోర్నమెంట్ ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఈ టోర్నీలో టీమిండియా రెండు వరుస విక్టరీలను సాధించి సూపర్-4లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్, హాంకాంగ్‌పై ఆడిన మ్యాచ్‌లల్లో విజయాలతో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తన తరువాతి మ్యాచ్‌ను ఆదివారం ఆడాల్సి ఉంది.

Exit mobile version