బిగ్ బాస్ షో ప్రారంభిస్తూ… నాగార్జున ఈసారి మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నారని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్న కంటెస్టెంట్స్ నంబర్ విషయంలో కూడా ఒక్కటి తక్కువ చెబుతూ వచ్చాడు. అయితే చివరిలో మాత్రం మొత్తం 21 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారంటూ వివరణ ఇచ్చాడు. ఈ మొత్తం కన్ ఫ్లూజన్ కు బిగ్ బాస్ షో మొదలైన రెండు రోజుల తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేశారు. భార్యాభర్తలైన రోహిత్ – మరినాను ఒకటి గానే కౌంట్ చేస్తున్నట్టు క్లారిఫికేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. వారిద్దరినీ ఎవరు నామినేట్ చేసిన కలిపే చేయాల్సి ఉంటుందని, వారిని వేర్వేరుగా చూడకూడదని తెలిపాడు. సో… హౌస్ లోంచి ఒకవేళ బయటకు రావాల్సి వస్తే… రోహిత్ అండ్ మరినా ఇద్దరూ కలిసే వచ్చేస్తారు. రేపు వాళ్ళు కెప్టెన్ అయినా కలిసే ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. గతంలో వరుణ్ సందేశ్, రితికాసేరు విషయంలో అలా జరగలేదు. వాళ్ళిద్దరూ భార్యభర్తలే అయినా ఇద్దరినీ వేర్వేరు కంటెస్టెంట్స్ గానే బిగ్ బాస్ పరిగణించాడు. ఇప్పుడు మాత్రం వీరిని ఒకరిగానే చూస్తామని చెప్పాడు. దాంతో మాస్ టీమ్ ఎంపిక చేసిన బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ కంటెస్టెంట్స్ లో బాలాదిత్య, ఆర్జే సూర్యతో పాటు రోహిత్ అండ్ మరినా జోడీకి చోటు దక్కింది. వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే… భార్యాభర్తలైన మరినా, రోహిత్ ఇద్దరూ ఓ ప్లాన్ ప్రకారమే హౌస్ లోకి అడుగుపెట్టారనిపిస్తోంది. తన భర్త పట్ల మరినా చాలా పొసెసివ్ గా ఉంటున్నట్టు బిల్డప్ ఇస్తోంది. అతను హౌస్ లోకి వచ్చిన తర్వాత తనతో సరిగా ఉండటం లేదంటూ తరచూ ఫిర్యాదు చేస్తోంది. రోహిత్ కూడా ఆమె పట్ల రెక్ లెస్ గానే ప్రవర్తిస్తున్నాడు. ఆమెను సన్నిహితంగా మెలగడానికి ఆసక్తి చూపించడం లేదు. చూస్తుంటే ఇది వ్యూవర్స్ అటెన్షన్ ను తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు ఆడుతున్న ప్రీ ప్లాన్డ్ గేమ్ లా అనిపిస్తోంది. అయితే… ఇలాంటి ట్రిక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు సాగవనేది వాస్తవం. ‘మేం భార్యాభర్తలం…. ఒకరితో ఒకరం క్లోజ్ గా ఉండాలని అనుకుంటాం… అందులో తప్పేంటీ?’ అని మరీనా తన కో-కంటెస్టెంట్స్ తో వాదనకు దిగుతోంది. అది నిజమే కానీ కపుల్ గా వచ్చినంత మాత్రాన హౌస్ లో కాపురం చేయాల్సిన అవసరం లేదు కదా!
అలానే ఎక్కువ మంది తనను నామినేట్ చేయడంతో ప్రస్ట్రేషన్ కి గురైన రోహిత్ కాస్తంత విపరీతంగానే ప్రవర్తిస్తున్నాడు. కాసేపు చివరి వరకూ తాను పోరాడతానని చెబుతూనే, డ్రామాలు ఆడే ఈ మనుషుల మధ్య తాను ఉండలేనని, బిగ్ బాస్ బయటకు పంపేస్తే హ్యాపీగా వెళ్ళిపోతానని కామెంట్ చేస్తున్నాడు. గతంలో ఇలాంటి కామెంట్స్ చేసిన వారిపై బిగ్ బాస్ తీవ్రంగా స్పందించాడు. అలాంటి ఆలోచన వున్న వాళ్ళు అసలు ఈ షోకు ఎందుకు వచ్చారంటూ క్లాస్ తీసుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే… రేవంత్ కూ బిగ్ బాస్ అలాంటి క్లాస్ పీకే ఆస్కారం ఉందనిపిస్తోంది. రేవంత్ మీద కొంతమందికి సాఫ్ట్ కార్నర్ ఉన్నా… తన యాటిట్యూడ్ తో వారిని కూడా అతను దూరం చేసుకుంటాడేమో అనిపిస్తోంది.