Robo Shankar : తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ చనిపోయిన విషయం తెలిసిందే. సినిమా సెట్ లో అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడు. ఆయన మృతిపట్ల సినీ సెలబ్రిటీలు ఎందరో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన భార్య ప్రియాంక పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు రోబో శంకర్, ఆమె ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. నేడు నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రియాంక గుండెలు అవిసేలా ఏడ్చింది.
Read Also : OG : రేపు ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
గుండెలు బద్దలయ్యే బాధను దిగమింగుకుని ఆమె అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ తో తన భర్తకు వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన వారంతా.. ప్రియాంక బాధను తట్టుకుని తన భర్తకు వీడ్కోలు పలుకుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. రోబో శంకర్ తమిళంలో కమెడియన్ గా, యాక్టర్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు దక్కించుకున్నాయి. ధనుష్, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆయన నటించారు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్