వివాదంలో ‘ఆచార్య’… పోలీసులకు ఆర్ఎంపీ డాక్టర్ల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం విడుదలైన ‘ఆచార్య’ ఐటెం సాంగ్ ‘శానా కష్టం’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు అదే సాంగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు మేకర్స్.
Read Also : పాపులర్ స్టాండ్ అప్ కమెడియన్ కు షాక్…. మునావర్ ఫారూఖీ షో రద్దు
Also Read
- Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
తాజాగా ‘ఆచార్య’ పాటపై ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే… ‘ఆచార్య’ చిత్ర యూనిట్ తాజాగా “శానా కష్టం” అనే ఐటెం నంబర్‌ను విడుదల చేసింది. మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ ఇన్‌స్టంట్‌గా హిట్ అయింది. భాస్కరబట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను రేవంత్, గీతా మాధురి ఆలపించారు. ఈ పాటలో మెగా స్టార్‌తో పాటు రెజీనా కసాండ్రా చిందేసింది. అయితే ఈ పాటలో “ఏడేడో నిమరోచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే” అనే లిరిక్ ఉంది. అంటే యువకులు రెజీనా లాంటి స్త్రీని ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టర్ అవుతున్నారని అర్థం వచ్చేలా ఉందా లిరిక్. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్యులు పాటలోని ఈ వాక్యాన్ని తప్పుగా భావిస్తున్నారు. ఈ పాట తమ వృత్తిని అవమానించేలా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ, జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత, దర్శకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!