Rithu Chowdary Shares a photo with srikanth: నటి, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నిజానికి జీ తెలుగులో సీరియల్స్ చేస్తూ నటిగా తన కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత ఒకసారి జీ తెలుగులో పాటలు పాడుతున్న యశశ్విని హగ్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఆ దెబ్బతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఆమె సోషల్ మీడియాలో చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్న రీతూ చౌదరి బుల్లితెరపైనా పలు షోలలో కనిపిస్తూ కామెడీ పంచులతో అలరించే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటూ ఉంటున్న ఆమె ఈ మధ్య లవ్‌లో పడిందంటూ ఒక వార్త అయితే పెద్ద వైరలయింది. శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదని రాసుకొచ్చిన క్రమంలో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని కన్ఫామ్ అయిపోయింది.
Bheemadevara Pally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి.. ఎందులో స్ట్రీమ్ అవుతోందంటే?
రీతూ నుదుటన శ్రీకాంత్ ముద్దు పెట్టిన వీడియో కూడా వైరల్ అవడంతో పాటు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఆ మధ్య ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వాళ్లిద్దరూ మళ్లీ కలిసి కనిపించనేలేదు. రీతూ తండ్రి చనిపోయినప్పుడు కూడా శ్రీకాంత్ ఆమెను ఓదార్చడానికి రాలేని క్రమంలో రీతూకి అతనికి దూరం పెరిగిందని, అతడితో కలిసి దిగిన ఫోటోలను సైతం డిలీట్ చేయడంతో వారిద్దరూ విడిపోయారని చెబుతున్నారు. ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ‘నిజాలు మాట్లాడుకుందాం’ అంటూ చిట్‌చాట్ నిర్వహించిన రీతూ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు అసలు పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది, అప్పుడే సంతోషంగా ఉండొచ్చని రిప్లై ఇవ్వడంతో ఇక ఆమె బ్రేకప్ ఖాయం అని అనుకున్నారు. అదే సమయంలో శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదా? అని అడగ్గా లేదన్నట్లుగా తలాడిస్తూ త్వరలోనే వివరంగా చెప్తానని చెప్పుకొచ్చింది. దీంతో రీతూ బ్రేకప్ నిజమేనని అభిమానులు భావిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆమె ఒక ఫొటో షేర్ చేసి షాక్ ఇచ్చింది. అందులో ఆమె శ్రీకాంత్ తో కలిసి కనిపిస్తోంది. అంటే ఇవన్నీ పుకార్లు అని ఒక్క ఫొటోతో తేల్చేసింది.