ఆ మధ్య ఇండియాలో రైతు ఉద్యమానికి మద్దతు పలికి వివాదాస్పదమైన రిహానా గుర్తుందా? అమెరికన్ పాప్ సింగర్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఆమె పాటలు రెగ్యులర్ గా చార్ట్ బస్టర్స్ అవుతుంటాయి. యూఎస్ టాప్ మ్యూజీషియన్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే, రిహానా తాజాగా రిచ్చెస్ట్ రికార్డ్ స్వంతం చేసుకుంది! ఆమె విలువ మన కరెన్సీలో మాట్లాడుకుంటే ఎంతో తెలుసా? 12వేల 603కోట్ల పై మాటే!
రిహానా నెట్ వర్త్ అంటూ ఫోర్బ్స్ కంపెనీ ఓ రిపోర్ట్ ప్రకటించింది. ఇందులో చెప్పే సంఖ్యలన్నీ అంచనాలు వేసినవే. అయితే, దాదాపుగా నిజమేనని నమ్ముతారు యూఎస్ జనాలు. ఆ కారణంగా రిహానా ఇప్పుడు ఫోర్ట్స్ రిచ్చెస్ట్ లేడీ మ్యూజీషియన్ గా మారిపోయింది. ఆమె నెట్ వర్త్ 1.7 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటోంది ఫోర్బ్స్ జాబితా!
Read Also : స్ట్రాంగ్ మదర్ గా సుహాసిని ‘మళ్ళీ మొదలైంది’!
రిహానా వందల కోట్ల అభివృద్ధి కేవలం సంగీతం, గానం వల్లే కాలేదు. ఆమె ఎంత చక్కటి సింగరో అంతే సమర్థవంతమైన బిజినెస్ ఉమన్ కూడా. ‘ఫెంటీ బ్యూటీ’ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ లో ఆమెకు 50 శాతం వాటా ఉందట. అదే 1.4 బిలియన్ డాలర్లకు సమానం అంటున్నారు. ఇక మిగతా విలువంతా ‘సావెజ్ ఎక్స్ ఫెంటీ’ అనే లోదుస్తుల బ్రాండ్ వల్ల, రిహానా పాప్ సింగర్ గా సంపాదించే ఆదాయం వల్ల ఏర్పడుతోందట. నెక్ట్స్ రిహానా క్రాస్ చేయాల్సింది ఓప్రా విన్ ఫ్రేని. ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన వినోద రంగంలోని మహిళ. ప్రస్తుతం రిహానా సెకండ్ రిచ్చెస్ట్ ఉమన్ ఎంటర్టైనర్ గా కొనసాగుతోంది!