వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు తనకు చచ్చిపోయినవాళ్లు నచ్చరు అని చెప్తాడు.. ఇంకొన్నిసార్లు చనిపోయినవాళ్లు దేవుళ్లు అంటూ వేదాంతం చెప్తాడు. ఇక తాజాగా ఈ దర్శకుడు సడెన్ గా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో దర్శనమిచ్చి షాక్ కి గురి చేశాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటునితో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు.…