Site icon NTV Telugu

Drishyam 3 : దృశ్యం-3 సస్పెన్స్ థ్రిల్లర్ కాదు.. డైరెక్టర్ క్లారిటీ..

Drsihyam

Drsihyam

Drishyam 3 : దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీలలో మంచి పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ దృశ్యం-1, దృశ్యం-2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్టు-3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండింటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తీయట్లేదు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు ఇక చాలు. ఇప్పుడు కొత్త కోణంలో మూడో పార్టును తీయాలని చూస్తున్నాం. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది.

Drishyam 3 : War 2 : వార్-2ను ఆ సీన్లు దెబ్బ కొట్టాయి.. ఆర్జీవీ కామెంట్స్

నేను గతంలో చేసిన సినిమాల కారణంగా ఇదే జోనర్ లో ఇరుక్కుపోయాను. కాబట్టి ఈ సారి డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. వాస్తవానికి దృశ్యం-2 తీయాలని నేను అనుకోలేదు. కానీ చాలా మంది ఇచ్చిన సలహా కొద్ది దాన్ని తీశాను. అది బాగానే వర్కౌట్ అయింది. కానీ మూడో పార్టును మాత్రం చాలా రియలస్టిక్ గా ఉండే సీన్లతో తీస్తున్నాం. ఈ సారి థ్రిల్లర్ కాకుండా వేరే ట్రై చేస్తున్నాను. అది వర్కౌట్ అయితే ఇక నుంచి నా జోనర్లు మార్చేస్తాను అంటూ తెలిపాడు డైరెక్టర్.

Drishyam 3 : Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..

Exit mobile version