సాయిరామ్ శంకర్ బర్త్ డే సందర్భంగా ‘రీసౌండ్’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాస్తంత విరామం తర్వాత హీరో సాయిరామ్ శంకర్ ఓ పర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎస్.ఎస్. మురళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, ఆ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని పవర్‌ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, బాబీ రీసౌండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే సాయిరామ్ శంకర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేషన్‌లోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అంతకు ముందు పోలీసులతో ఘర్షణ జరిగినట్లు పోస్టర్ బట్టీ తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కిస్తున్న విషయం అర్థమౌతోంది. జె. సురేష్ రెడ్డి, బి. అయ్యప్ప రాజు, ఎన్.వి.ఎన్. రాజారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీత దర్శకత్వం వహిస్తుండగా సాయిప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రీసౌండ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!