Renu Desai : రేణూ దేశాయ్ మళ్లీ సీరియస్ అయ్యారు. తన గురించి ఎలాంటి వార్తలు వచ్చినా ఆమె ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె తన రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో మీడియాలో ఆమె మాట్లాడిన మిగతా విషయాల కంటే రెండో పెళ్లి గురించి బాగా హైలెట్ వార్తలు రాయడంపై ఆమె తాజాగా సీరియస్ అయ్యారు. ‘నేను పాడ్ కాస్ట్ లో ఎన్నో విషయాలు మాట్లాడాను. కానీ అవేమీ పట్టించుకోకుండా నా రెండో పెళ్లిపైనే మీడియాకు ఎందుకంత ఆసక్తి’ అంటూ తెలిపింది.
Read Also : Neha Shetty : తనివితీరని అందాలతో నేహాశెట్టి హంగామా..
‘నేను సమాజంలోని అనేక విషయాలపై మాట్లాడాను. వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ నా రెండో పెళ్లిన మాత్రమే ఎందుకు అంత హైలెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను అందరినీ కోరేది ఒక్కటే. ఈ 44 ఏళ్ల మహిళ గురించి మీ దృష్టిని మరల్చండి’ అంటూ ఆమె కోరింది. పాడ్ కాస్ట్ లో.. తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. పిల్లల కోసమే చేసుకోలేదన్నారు. తన కూతురు ఆధ్యకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో బాగా హైలెట్ కావడంతో ఆమె ఈ విధంగా స్పందించారు.