OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు థియేట్రికల్ మాత్రమే సర్వస్వం. కానీ ఇప్పుడు కాలం మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు ఓటీటీ క్లియరెన్స్ అనేది అత్యంత కీలకంగా మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే నాన్-థియేట్రికల్ రెవెన్యూనే నిర్మాతలకు పెద్ద సేఫ్ జోన్. అయితే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు భారీ సినిమాలకు షాక్ ఇస్తుండటంతో రిలీజ్ డేట్లను ప్రకటించడానికి కూడా నిర్మాతలు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తోంది.
కన్నడ స్టార్ హీరో యశ్ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. మొదట ఈ సినిమాను మార్చి 19న ఆ తర్వాత జూన్ 4న విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. ఈ వాయిదా వెనుక అసలు కారణం ఓటీటీ బిజినెస్ క్లియర్ కాకపోవడమే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ‘టాక్సిక్’ బడ్జెట్ ఇప్పటికే రూ. 500 కోట్లు దాటిపోయినట్లు సమాచారం. ఇంత భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే ఓటీటీ రూపంలో కనీసం రూ. 250 కోట్లు వస్తుందని మేకర్స్ అంచనా వేశారు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం కేవలం రూ. 120 కోట్ల వరకే ఆఫర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. తాము ఆశించిన రేటు రాకపోవడంతో బిజినెస్ క్లియర్ అయ్యే వరకు రిలీజ్ డేట్‌పై ముందడుగు వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ క్లియరెన్స్ రాకుండా థియేటర్లలోకి వస్తే బడ్జెట్ రికవరీ పరంగా రిస్క్ ఎక్కువ అనే ఉద్దేశంతోనే ‘టాక్సిక్’ వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Also Read
- PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
- Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
కేవలం ‘టాక్సిక్’ మాత్రమే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’, యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా హిస్టారికల్ ఫిల్మ్ స్వయంభు చిత్రాలకు కూడా ఇదే తరహా ఓటీటీ సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాల బడ్జెట్లు అంచనాలకు మించి పెరిగిపోయాయి. పెరిగిన బడ్జెట్‌ను ఎంతోకొంత కవర్ చేసుకోవడానికి ఓటీటీ రైట్స్ పెద్ద దిక్కు. కానీ గతంలో లాగా ఓటీటీ సంస్థలు కళ్ళు మూసుకుని వందల కోట్లు కుమ్మరించడం లేదు. మార్కెట్ ఒడిదొడుకులు, సబ్స్క్రిప్షన్ల లెక్కలను బట్టి చాలా తక్కువ ధరలకే రైట్స్ అడుగుతున్నాయి. దీంతో బడ్జెట్ ఒకలా ఉంటే ఓటీటీ ఆఫర్లు మరోలా ఉండటంతో బిజినెస్ డీల్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఓటీటీ డీల్స్ క్లియర్ అయితేనే నిర్మాతలకు ఆర్థికంగా ఒక భరోసా దొరుకుతుంది. ఆ క్లియరెన్స్ వచ్చే వరకు రిలీజ్ డేట్లు ప్రకటించలేక ఒకవేళ ప్రకటించినా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి పెద్ద సినిమాలకు సైతం ఎదురవుతోంది. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మరియు ఓటీటీ ఆఫర్ల మధ్య సమతుల్యత ఎలా కుదురుతుందో చూడాలి
తాజావార్తలు
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్‌లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!