AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AamirKhan Marriage: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఆ వార్తల సారాంశం ఏంటంటే.. 61 ఏళ్ల ఆమిర్ ఖాన్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఈ ప్రచారం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. తాజాగా గౌరీ స్ప్రత్ అనే మహిళతో ప్రేమలో పడ్డారని, వీరిద్దరూ త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ బాలీవుడ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ వివాహానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్ డేట్ కూడా లీకై నెట్టింట చక్కర్లు కొడుతోంది. జులై 5న ఆమిర్ ఖాన్ తన నివాసంలోనే చాలా సింపుల్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా ‘రిజిస్టర్ మ్యారేజ్’ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఈ వెడ్డింగ్ రూమర్స్‌పై ఆమిర్ ఖాన్ టీమ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి ఆమిర్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు కూడా తీసుకున్నారు. మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆయన, ఆ తర్వాత కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో కిరణ్ రావుతో కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ఆమిర్ అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?