Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భుజంగరావును అరెస్ట్ చేసిన ఏసీబీ పోలీసులు తాజాగా జడ్జీ ముందు ప్రవేశ పెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్న(బుధవారం) హైదరాబాద్‌తో పాటు 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇక నిన్న(బుధవారం) భుజంగరావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగాయి. భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించారు. భుజంగరావుతో పాటు ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తుల వద్ద సైతం ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సోదాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తుల పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం భుజంగరావు ఆస్తుల విలువ రూ.5.92 కోట్లుగా లెక్కగట్టారు. మార్కెట్లోకి వాటి విలువ పది రెట్లు ఉండొచ్చని ఏసీబీ అభిప్రాయపడుతోంది.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!