NTV Telugu Site icon

Laapataa Ladies: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న సినిమా..ఏకంగా యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా

Lapata Ladies 11

Lapata Ladies 11

“Laapataa Ladies” Breaks Records on Netflix: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘లాపటా లేడీస్’ ఓటీటీలో అదరగొడుతుంది. ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ విడుదలైన నెల రోజుల లోనే నెట్‌ఫ్లిక్స్‌లో 13.8 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Also Read; Keerthy Suresh Lip Lock: లిప్ లాక్‌కి ఓకే చెప్పిన కీర్తి సురేష్.. ఆ పెళ్లయిన హీరోకి పండగే!

ఒక చిన్న సినిమాగ తెరెకెక్కిన ఈ మూవీ కంటెంట్ బలంగా ఉంటే చాలు ప్రచారాలు అక్కర్లేదని మరోసారి నిరూపించింది. పెద్ద స్టార్ నటీనటులు లేకుండా కేవలం రూ.4 కోట్లతో నిర్మించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.. మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన బాలీవుడ్ మూవీస్‌లో అత్య‌ధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న మూవీలో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ జాబితాలో హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ 14 మిలియ‌న్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది.

Also Read; Family Star : మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నవిజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’..

ఇక ‘లాపతా లేడీస్’ కథ విషయానికి వస్తే గ్రామీణ భారతదేశం నేపథ్యంలో సాగే ఈ చిత్రం కొత్తగా పెళ్లి అయినా ఒక జంట రైలులో ప్రయాణం చేస్తారు ఆ తరువాత ఆ రైలు నుండి రహస్యంగా తప్పిపోయిన ఇద్దరు యువ వధువుల గురించి ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్న‌దే లాప‌తా లేడీస్ క‌థ‌.. ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ, రవికిషన్, ఛాయా కదమ్ కీలకపాత్రలు పోషించారు. కిరణ్ రావుతో కలిసి ఆమె మాజీ భర్త నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సెప్టెంబర్ లోనే ప్రదర్శితమైంది.

Show comments