ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ఆదిపురుష్ ట్రైలర్. టీజర్‌తో ఆదిపురుష్‌కు జరిగిన డ్యామేజ్ అంతా ట్రైలర్‌తో కొట్టుకుపోయింది. అసలు ఆదిపురుష్ ట్రైలర్, సినిమాపై అంచనాలను ఇంత పీక్స్‌కు తీసుకెళ్తాయని ఓం రౌత్ కూడా ఊహించలేదేమో. ఒకే ఒక్క ట్రైలర్‌తో ఆదిపురుష్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఒకటే నినాదం ‘జై శ్రీరామ్’ మాత్రమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జూన్ 16 థియేటర్లన్నీ రామమందిరాలుగా మారనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. అర్జున్ రెడ్డి వంటి ‘రా’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా, ప్రెజెంట్ హిందీలో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో సత్తా చాటిన సందీప్ యానిమల్‌తోనూ సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఆగష్టులో యానిమల్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు సందీప్.
అసలు ప్రభాస్‌ను ఈ ‘రా’ డైరెక్టర్ ఎలా చూపిస్తాడనేది అనౌన్స్మెంట్ నుంచే ఎగ్జైటింగ్‌గా మారింది. ప్రస్తుతం సందీప్ యానిమల్ షూటింగ్ తో పాటు.. స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ ఓ రేంజ్‌లో వచ్చిందట. అసలు ఈ సినిమాలో ప్రభాస్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందట. ఎంతలా అంటే.. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌కి పది రెట్లు ఎక్కువగా.. స్పిరిట్‌లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని టాక్. ఈ సినిమాతో అసలు సిసలైన ‘రా’ అంటే ఏంటో చూపించబోతున్నాడట సందీప్. ఇప్పటికే ప్రభాస్ పవర్ ఫుల్ కాప్‌గా కనిపించబోతున్నట్టు టాక్ ఉంది. కాబట్టి ఒక యాంగ్రీ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడు అనే ఆలోచనకే స్పిరిట్ పై అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతున్నాయి. 2024 మిడ్ లో ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి స్పిరిట్ ఎలా ఉంటుందో చూడాలి.