Site icon NTV Telugu

Prabhas: తన రికార్డులను తనే బ్రేక్ చేస్తున్న ప్రభాస్.. తాజాగా మరో రికార్డు బ్రేక్..?

Kalki2

Kalki2

Rebeal Star Prabhas Breaks His Own Records: భారీ కలెక్షన్స్ తో నాలుగు రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ” బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయ్యింది. ఒకపక్క ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉండగా మరోపక్క థియేటర్స్ లో జనాలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో కల్కి థియేటర్స్ కి ఎగబడుతున్నారు. దాంతో బుక్ మై షోలో గంట గంటకి టికెట్ సేల్స్ లో సెన్సేషనల్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా సినిమా డే3తో పోల్చితే డే4 సూపర్బ్ ట్రెండ్ ను కొనసాగించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి సాలిడ్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా మూడో రోజుతో పోల్చితే నైజాంలో 4వ రోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇదే కొనసాగితే లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు కల్కి సృష్టించడం ఖాయం అనిపిస్తుంది.

Also Read: Kalki 2898 AD: విదేశాల్లో కూడా రికార్డులు తిరగరాస్తున్న “కల్కి 2898 ఏడీ”

మరొక పక్క ప్రభాస్ తన రెకార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో మొదటిసారి రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరాడు. బాహుబలి అనంతరం వచ్చిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. ఇందులో బాహుబలి 2 తప్పితే.. మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్‌లో 500-600 కోట్లు సాధించాయి. కల్కి 2898 ఏడీ మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే.. రూ.500 కోట్ల మార్క్‌ను దాటాడు. ఇప్పుడు ప్రభాస్ మరొక రికార్డు పైన కన్ను వేసాడు. ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ కేవలం వారం రోజుల్లో బ్రేక్ చేయబోతున్నాడు. ప్రస్తుతం నాలుగో రోజాల్లో 500 కోట్లు క్రాస్ చేసిన కల్కి ఈ వారం గడిచే సరికి సలార్ కలెక్షన్స్ దాటేయనుంది.

Exit mobile version