RC 15: మార్చ్ 27న మెగా పండగ గ్యారెంటీనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ ప్రాంతంలో జరిగింది. సింహాద్రి అప్పన్న సాక్షిగా, ఒక భారి సెట్ ని వేసి RC 15 సినిమా సాంగ్ షూట్ చేశాడు శంకర్. చరణ్, కియారా అద్వానీలపై డిజైన్ చేసిన ఈ సాంగ్ చరణ్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ని శంకర్ తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే RC 15 సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ మార్చ్ 27న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆరోజు చరణ్ బర్త్ డే ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసి అఫీషియల్ గా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి RC 15 ఫస్ట్ లుక్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.
Read Also: NTR: మార్చ్ 17న కలవనున్న ‘మాస్-దాసు’
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ కాగా, ఇంకొకటి స్టూడెంట్ రోల్, మూడోది CM పాత్ర. ఈ పాత్రలో చరణ్ పంచెకట్టుతో పూర్తి స్థాయి విలేజ్ లుక్ లో కనిపిస్తాడు. ఈ రోల్ కోసం పొలిటికల్ క్యాంపెయిన్ ఎపిసోడ్ షూట్ చేసిన శంకర్, చరణ్ ని తెలుగు రాష్ట్రం మొత్తం తిప్పాడు. హీరోయిన్ అంజలి, CM పాత్రకి వైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక లీక్డ్ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!