NTR: మార్చ్ 17న కలవనున్న ‘మాస్-దాసు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన ఎన్టీఆర్ ఫాన్స్ ని మీట్ అవుతూ ఫోటోసెషన్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇండియాకి తిరిగిరాగానే తన బిగ్గెస్ట్ ఫాన్స్ లో ఒకరైన ఒక ఫ్యాన్ ని తన ఫాన్స్ ముందు మీట్ అవుతున్నాడు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా… కాంప్లికేట్ చెయ్యకుండా క్లియర్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి ఎంతోమంది ఫాన్స్ ఉంటారు కానీ విశ్వక్ సేన్ లాంటి ఫ్యాన్ ఉండడం కష్టం. మాస్ కా దాస్ అనే స్పెషల్ ఇమేజ్ ని, మార్కెట్ ని సొంతం చేసుకున్న విశ్వక్ సేన్.. ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ తన ఫేవరేట్ హీరో అని చెప్తూ ఉంటాడు. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఇంకో హీరోకి తాను ఫ్యాన్ అని చెప్పుకోవడానికి కొంతమందికి ఇగో అడ్డు వస్తుంది కానీ అలాంటి ఫీలింగ్ లేకుండా విశ్వక్ చాలా ఓపెన్ గా ఎన్టీఆర్ కి నేను ఫ్యాన్ అని చెప్తుంటాడు. గతంలో ఒకసారి ఎన్టీఆర్ పుట్టిన రోజుకి విశ్వక్ సేన్ స్పెషల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశాడు. తారక్ అంటే విశ్వక్ కి అంత ఇష్టం కాబట్టే విశ్వక్ అంటే ఎన్టీఆర్ ఫాన్స్ కూడా విశ్వక్ ని ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటివరకూ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా వాయిదా పడింది.
ఇటివలే దాస్ కా ధమ్కీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన విశ్వక్ సేన్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాడు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న రూమర్ ని బట్టి చూస్తే దాస్ కా ధమ్కీ సినిమా మార్చ్ 22న ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. మిడ్ వీక్ లో, ఉగాది పండగ రోజున మేకర్స్ ధమ్కీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వస్తుండడంతో విశ్వక్ సేన్ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు ఫస్ట్ మండేకే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మార్చ్ 17న శిల్పారామంలో చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను గెస్ట్ గా పిలిచే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దాస్ కా ధమ్కీ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజులో సౌండ్ చెయ్యాలి అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ లాంటి హీరో రావాల్సిందే. దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తే అది ఎన్టీఆర్ ఫాన్స్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ ఇవ్వడం గ్యారెంటీ. ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తే విశ్వక్ సేన్ ఫాన్స్ జోష్ లోకి వచ్చేస్తారు.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!